Ap govt: దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక పింఛను ఎలా కోరుకుంటే అలా తీసుకోవచ్చు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap govt)ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేస్తున్న పింఛను పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది.

Ap govt allows disabled students to choose pension delivery mode

  • దివ్యాంగులకు పింఛను ఎంపిక వెసులుబాటు
  • పాఠశాలల్లోనే నగదు అందజేసే సదుపాయం
  • అర్హులందరికీ త్వరలో పింఛన్ల మంజూరు

Ap govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద వైకల్యం కలిగిన విద్యార్థులకు అందజేస్తున్న నెలవారీ రూ.6 వేల పింఛను పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. రాష్ట్రంలోని (Ap govt)వివిధ అంధుల, బధిరుల గురుకులాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు తమకు ఏ పద్ధతిలో పింఛను అందాలో స్వయంగా ఎంచుకునే వెసులుబాటును కల్పించింది. దూర ప్రాంతాల నుండి వచ్చి వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం అక్టోబర్ నెల నుండి ఈ నూతన విధానాన్ని అమలు చేసేందుకు సెర్ప్ అధికారులు అవసరమైన కసరత్తును వేగవంతం చేశారు.

Cm Revanth Reddy: సీఎం రేవంత్ US టూర్ రద్దు.. కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహం.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా

విద్యార్థుల అభిప్రాయాల ప్రకారం మూడు రకాల మార్గాలు:

రాష్ట్రంలో ఉన్న 6 అంధుల, బధిరుల గురుకుల పాఠశాలలు, ఒక కళాశాలలో మొత్తం 424 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. 116 మంది విద్యార్థులు తమ పింఛను మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. మరో 17 మంది విద్యార్థులు తాము చదువుకునే గురుకులానికి సమీపంలో ఉన్న స్వర్ణ సచివాలయానికి వివరాలు మ్యాప్ చేసి, పాఠశాల ప్రాంగణంలోనే అందించాలని విన్నవించారు. మిగిలిన 178 మంది పాత విధానంలోనే తమ ఇంటి వద్దకే పింఛను అందించాలని స్పష్టం చేశారు.

113 మందికి కొత్తగా పింఛను మంజూరుపై దృష్టి:

గురుకులాల్లో చదువుతున్న వారిలో దాదాపు 113 మంది విద్యార్థులకు కొన్నేళ్లుగా పింఛను అందడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. సాధారణంగా కొత్త పింఛన్ల మంజూరుతో సంబంధం లేకుండా తీవ్ర వైకల్యం ఉన్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ల సిఫార్సు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా సహాయం అందిస్తుంది. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తే ఈ 113 మందికి కూడా త్వరలోనే క్రమం తప్పకుండా పింఛను అందే అవకాశముంది.