New Bar Policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. దరఖాస్తులు షురూ.. ఈ నిబంధన సడలింపు.. 10 శాతం వీరికే.. పూర్తి వివరాలు ఇవే..

కొత్త వారు ఈ బిజినెస్ లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని చెప్పారు. గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాలని, ఈ సారి ఈ నిబంధన సడలించారని వివరించారు.

New Bar Policy

New Bar Policy: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ నిర్ణయం తీసుకుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 840 బార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని, 10 శాతం కల్లు గీత కులస్తులకు కేటాయిస్తామని తెలిపారు.

కొత్త వారు ఈ బిజినెస్ లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని చెప్పారు. గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాలని, ఈ సారి ఈ నిబంధన సడలించారని వివరించారు. New Bar Policy

పూర్తి వివరాలు ఇవే..

  • 30 రోజుల్లోగా రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చు
  • 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షల లైసెన్స్ ఫీజు
  • 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.55 లక్షలు లైసెన్స్ ఫీజు
  • 5 లక్షలపైన జనాభా ఉంటే లైసెన్స్ ఫీజ్ రూ.75 లక్షలు
  • ప్రతి ఏడాది 10 శాతం పెంపు
  • గతంలో ఒకేసారి ఆగస్ట్ లోపు లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉండేది
  • ఈసారి 6 సార్లుగా చెల్లింపులు జరపవచ్చు
  • నేటి నుంచి ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు
  • 28న లాటరీ తీసి బార్లు కేటాయింపు
  • సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి
  • గతంలో బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి
  • ఈసారి ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు బార్లకు అనుమతి
  • అన్ని కేటగిరీలో అప్లికేషన్ ఫీజు 5 లక్షలు గా నిర్ణయించాం
  • గతంలో కేటగిరీల బట్టి 7.5 లక్షలు, 10 లక్షల వరకు ఉండేది
  • ఒక బార్ కి 27 అప్లికేషన్లు గతంలో వచ్చాయి
  • కొన్ని చోట్ల మద్యం సిండికేట్లు కొత్త వారిని రాకుండా చేసే అవకాశం ఉంది. వాటిని ఆపేందుకు కొత్త నిర్ణయాలు
  • లైసెన్స్ ఫీజ్ 70 నుంచి 50 శాతానికి తగ్గింపు
  • ఎయిర్ పోర్ట్స్ లో బార్ల లైసెన్స్ కు ప్రభుత్వం నుంచి త్వరలో గైడ్ లైన్స్