August 27th Holiday in AP
August 27th Public holiday in AP : ఏపీలో విద్యాసంస్థలకు ఆగస్టు 27న సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. నెలలో రెండో శనివారం కాదు..మరి 27న సెలవు ఎందుకు ప్రకటించింది అనే డౌట్ వస్తుంది. ఆగస్టు 13న రెండో శనివారం సెలవు రోజు. కానీ ఆరోజు సెలవు ఇవ్వలేదు. ఎందుకంటే ఆగస్టు 13న రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖ సిబ్బంది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతూ పూర్తి స్థాయిలో పనిచేశాయి.
ఆగస్టు 13 రెండో శనివారమైనప్పటికీ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా సెలవు తీసుకోలేదు. దీంతో ఏపీ సర్కారు రెండో శనివారానికి బదులుగా ఈ నెలలో వస్తున్న నాలుగో శనివారమైన ఆగస్టు 27 సెలవుగా ప్రకటిస్తున్నట్టు ఏపీ విద్యా శాఖ స్పష్టంచేసింది.