School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న స్కూళ్లకు సెలవు
ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు (School Holiday) ప్రకటించింది.
- V Santhosh Kumar
- Updated on- June 16, 2026 / 10:44 AM IST
Ap govt declares school holiday on june 26
- ఈ నెల 26న స్కూళ్లకు సెలవు.
- మొహర్రం హాలిడే తేదీల్లో మార్పు.
- ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు వర్తింపు.
School Holiday: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముందుగా ప్రకటించిన సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం జూన్ 25వ తేదీన ఈ హాలిడే ఉండాల్సి ఉంది, కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దీనిని ఒక రోజు ముందుకు జరిపారు.
ముస్లింల పవిత్ర పండుగైన మొహర్రం జూన్ 26వ తేదీన జరగనుందని వక్ఫ్ బోర్డు సీఈవో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందించారు. ఈ సమాచారంతో అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం.. ముందుగా నిర్ణయించిన జూన్ 25 నాటి సెలవు (School Holiday)ను జూన్ 26వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పు కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తిస్తుందని జీవోలో స్పష్టం చేశారు.
ఇక వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12వ తేదీ నుంచే పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం జూన్ 15వ తేదీ నుండి స్కూల్స్ రీ-ఓపెన్ అయ్యాయి. బడులు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే ఏపీ విద్యార్థులకు మొహర్రం పండుగ సందర్భంగా ఈ నెల 26వ తేదీన (శుక్రవారం) మొదటి ప్రభుత్వ సెలవు లభించనుంది.
