×
Ad

AP Govt : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రంగాల్లోని ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.5వేలు పెంపు

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అదేవిధంగా కొత్తగాచేరి, ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది.

Hikes Salary

  • ఏపీలో 108 డ్రైవర్లు, ఉద్యోగులకు జీతాలు పెంపు
  • ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులకు రూ.5వేలు
  • కొత్తగా ఉద్యోగాల్లో చేరి ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు పెంపు

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వేళ ఆపద్భాంధవులుగా సేవలందిస్తున్న 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.

Also Read : AP Budget 2026 : ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. ప్రతినెలా రూ.1500..! ముహూర్తం ఫిక్స్

ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అదేవిధంగా కొత్తగాచేరి, ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది. దీంతోపాటు కొత్త వాహనాలు సమకూర్చింది. ప్రభుత్వం తాగా చర్యలతో ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. గతంలో పైలట్‌కు రూ.18వేలు జీతం ఇవ్వగా ఇప్పుడు రూ. 23వేలకు పెరిగింది. గతంలో ఈఎంటీకి రూ.20వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 25వేలకు పెరిగింది. కొందరు ఫైలట్ లకు రూ.20వేలకు.. మరికొంతమంది ఈఎంటీకి రూ.23వేలకు జీతాలు పెరిగాయి. ఈ నెల నుంచి పెంచిన జీతాలు బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి.

వేతనాలు పెంచినందుకు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక పెంపుదల నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈనెల నుంచి స్లాబ్ ఆప్డేషన్ చేసిన వేతనాలు అందించడంతో ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఆపదలో ఉన్నవారికి విధి నిర్వహణలో మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.