AP Budget 2026 : ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. ప్రతినెలా రూ.1500..! ముహూర్తం ఫిక్స్
AP Budget 2026 : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించేందుకు సిద్ధమైంది.
Aadabidda Nidhi Scheme
- నేడు ఏపీ బడ్జెట్
- అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్
- ‘ఆడబిడ్డ నిధి’ పథకంపై బడ్జెట్లో కీలక ప్రకటన వచ్చే చాన్స్
AP Budget 2026 : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించేందుకు సిద్ధమైంది. రైతులతో పాటు మహిళల ఆర్థికాభివృద్ధికి ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.
Also Read : Somireddy Chandra Mohan Reddy: అసెంబ్లీలో జగన్పై మాజీమంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27 అసెంబ్లీ వేదికగా ఇవాళ ఆవిష్కృతం కానుంది. శనివారం ఉదయం 11గంటల 15 నిమిషాలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధుల కేటాయింపులో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్లో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
మరోవైపు.. మహిళా సంక్షేమంకోసం బడ్జెట్లో కూటమి ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేయనుంది. పముఖ్యంగా 18ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500 అందించే ‘ఆడబిడ్డ నిధి’ పథకంపై ఈ బడ్జెట్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేయొచ్చుననే అంచనాలు బలంగా ఉన్నాయి.
ఈ పథకం అమలుకోసం అవసరమైన భారీ నిధులను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, స్త్రీశక్తి కార్యక్రమాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు.
