ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ కూటమి సర్కారు ఉత్తర్వులు

అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తెలంగాణ/ఏపీ ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు.. చట్టబద్ధంగా ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి పంపనున్నారు.

అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. దీర్ఘకాలికంగా కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు 122 మంది తెలంగాణ ఉద్యోగులు. తిరిగి వారి సొంత తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 122 మంది తెలంగాణకు ఉద్యోగుల నుంచి సంబంధిత ప్రొఫార్మాలో అండర్ టేకింగ్ తీసుకుని వారి వారి కేడర్లోనే రిలీవ్ చేయాలని అన్ని శాఖాధిపతులు కార్యాలయాల ఉన్నతాధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతున్నాం- వైఎస్ షర్మిల

ట్రెండింగ్ వార్తలు