Liquor Sales : మద్యం అమ్మకాల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్.. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం..

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుంది.

Liquor Sales (Photo Credit : Google)

Liquor Sales : మద్యం అమ్మకాల్లో అక్రమాలపై ఏసీ సర్కార్ చర్యలకు సిద్ధమైంది. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనలపై సర్కార్ సీరియస్ అయ్యింది. మద్యాన్ని ఎమ్మార్పీకన్నా అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5లక్షలు జరిమానా విధించనుంది. రెండోసారి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

మద్యం అక్రమాల వ్యవహారంలో ఏపీ సర్కార్ సీరియస్ నిర్ణయాలు తీసుకుందని చెప్పాలి. మద్యం అమ్మకాల్లో గతంలో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు సిండికేట్ అయ్యి అధిక ధరలకు మద్యాన్ని విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఇలాంటి అక్రమాలు జరక్కుండా చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోంది.

మద్యం అక్రమాల వ్యవహారంలో భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే 5 లక్షల జరిమానా విధించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. రెండోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తారు. మద్యం దుకాణాల పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.5లక్షల జరిమానా, ఇదే తప్పు రెండోసారి చేస్తే లైసెన్స్ రద్దుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47 వన్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవే నిబంధనలు బార్ లైసెన్సులకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

లోపాయికారి ఒప్పందం చేసుకుని మద్యం దుకాణాల లైసెన్స్ లు దక్కించుకున్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. తద్వారా సిండికేట్ కావడం అంటే ఒకే వ్యక్తికి అనేక షాపులు రావడం, వారి వర్గీయులకు, ఆ రాజకీయ పార్టీలకు చెందిన వర్గాలకు రావడం.. ఈ నేపథ్యంలో సిండికేట్ అయ్యి అధిక ధరలకు మద్యం విక్రయించే అవకాశం ఉంది.

మద్యం షాపులు నిర్వహించే పరిధిలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. మద్యం దుకాణాలు నిర్వహించే వారు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మద్యం దుకాణాల నిర్వహకులకు పెద్ద హెచ్చరికనే జారీ చేసినట్లు చెప్పొచ్చు.

 

Also Read : డిస్ట్రిక్ రీఆర్గనైజేషన్‌పై ఏపీ సర్కార్ స్టెప్ ఏంటి? దూరంగా ఉన్న జిల్లా కేంద్రాలను మార్చబోతున్నారా?