Andhra Pradesh : సభలు, ర్యాలీలు నిషేధంపై రాజకీయ రగడ.. పవన్ ‘వారాహి’ యాత్ర, లోకేశ్ పాదయాత్రలకు అడ్డుకోవటానికేనంటూ విమర్శలు

సభలు, ర్యాలీలు నిషేధంపై రాజకీయ రగడ.. పవన్ ‘వారాహి’ యాత్ర, లోకేశ్ పాదయాత్రలకు అడ్డుకోవటానికేనంటూ విమర్శలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Andhra Pradesh : రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కందుకూరు, గుంటూరు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సభల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు మరణించారు. దీంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు పలు యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు. వాటిని కొనసాగిస్తున్నారు. అలాగే త్వరలోనే నారా లోకేశ్ పాదయాత్ర ‘యువగళం’కూడా ప్రారంభం కానుంది. మరోపక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలనాత్మక రథం ‘వారాహి’పై యాత్ర మొదలుపెట్టనున్నారు. ఓ పక్క చంద్రబాబు సభలకు భారీగా తరలివస్తున్న జనం..రేపటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో పర్యటన ఉంది. మరోపక్క పవన కల్యాణ్ వారాహి యాత్ర కోసం ఏపీ ప్రజల ఎదురు చూపులు ఈ తరుణంలో చంద్రబాబు సభల్లో జరిగిన అపశృతులను ఆసరాగా తీసుకుని సభలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించటం చూస్తుంటే వీరి యాత్రలను అడ్డుకోవటానికేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

జగన్ సభలకు ఇటువంటి ఆంక్షలు వర్తించవా? కేవలం టీడీపీ సభలకే ఆంక్షలు వర్తిస్తాయా? అంటూ విమర్శలు సంధిస్తున్నారు టీడీపీ నేతలు. ఎందుకంటే మంగళవారం (జనవరి, 3,2023)రాజమండ్రిలో జగన్ సభ ఉంది. ఈ సభకు ఆంక్షలు వర్తించవా? అంటూ విమర్శిస్తున్నారు.

ఓ పక్క చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాధరణ, మరోపక్క పవన్ కల్యాణ్ సభలకు కూడా వస్తున్న అశేషమైన జనాదనరణను చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని అందుకే చంద్రబాబు సభల్లో జరిగిన ఘటనలను సాకుగా పెట్టుకుని ఇటువంటి నిర్ణయం తీసుకుందంటు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూనే ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు అంటోంది ప్రభుత్వం సాధారణంగానే ఏపార్టీ వారైనా సభలు నిర్వహించుకుంటామంటేనే అనుమతులు లేవని అడ్డుకుంటున్న పరిస్థితుల్లో ఇక ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు ఇస్తుందా? ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు అంటే అధికార పార్టీకేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాలన్ని విపక్షాల గొంతు నొక్కటానికేనంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ నిషేధాల జీవో నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాదంటూ ఎద్దేవా చేశారు టీడీపీ నేత బోండా ఉమ.

జగన్ కు ఇష్టమొచ్చినట్లుగా ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించటానికి జగన్ ఇష్టం కాదని దానికి రాజ్యాంగం ప్రకారమే తాము ఏ కార్యక్రమమైనా నిర్వహిస్తామని అంతే తప్ప ఇష్టమొచ్చినట్లుగా జీవోలు ఇచ్చి ఎవరైనా అతిక్రమిస్తే అరెస్ట్ లు చేస్తామంటూ ఎవ్వరు భయపడరని స్పష్టంచేశారు. చంద్రబాబు సభలకు వచ్చే జనాదరణను చూడలేకే వైసీపీ ప్రభుత్వం ఇటువంటి నిషేధాలు తీసుకొచ్చిదంటూ మండిపడ్డారు బోండా ఉమ. కాగా రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తే హోం మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.

ప్రతిపక్షాలు రోడ్లపైకి రాకూడదంటూ ఆంక్షలు విధించటం సరికాదంటూ ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలపై సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ..సభలు నిర్వహించటం పార్టీల హక్కు అని ఆ హక్కును వినియోగించకూడదంటూ జీవోలు జారీచేయటం సరికాదన్నారు.వైసీపీ మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తాస్తాయా? అంటూ ప్రశ్నించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు