AP Pensions : ఏపీ సర్కార్ శుభవార్త… జూన్ 1న ఆ 62,34,445 మంది డబ్బు..

AP Pensions : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 62 లక్షల మందికి పైగా శుభవార్త చెప్పింది.

Ap govt release Ntr Bharosa Pension Funds for June month Doorstep Delivery

  • ఏపీ సర్కార్ శుభవార్త
  • జూన్ పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం
  • సోమవారం ఉదయం నుంచే పంపిణీ

AP Pensions : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు మరోసారి తీపి కబురు అందించింది. జూన్ నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం రూ. 2,728 కోట్లను కేటాయించింది. ఎప్పటిలాగే వచ్చే నెల మొదటి తారీఖున, అంటే జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా నగదును చేతికి అందించనున్నారు.

ఈ జూన్ నెలలో ఏపీ వ్యాప్తంగా మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులకు ఈ సామాజిక భద్రతా పెన్షన్లు అందనున్నాయి. ఈసారి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త లేదా భార్య చనిపోయిన వారికి ఇచ్చే ‘స్పౌజ్ పెన్షన్లను’ కొత్తగా మరో 5,606 మందికి మంజూరు చేసింది. ఈ కొత్త స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లను ప్రభుత్వం అదనంగా విడుదల చేసింది. దీనివల్ల ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ల కోసమే ఏకంగా రూ. 65,886.57 కోట్లను ఖర్చు చేసిందని అధికారులు ప్రకటించారు.

* ఏపీలో పెన్షనర్లకు అలర్ట్.. పెన్షన్ రద్దైన, డబ్బులు ఆగిపోయిన వారికి గుడ్‌న్యూస్.. వెంటనే ఇలా చెయ్యండి! కొద్దిరోజులు మాత్రమే..

ఆర్థిక సమస్యలున్నా సరే.. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ నిధులు విడుదల చేస్తూ వస్తోన్న కూటమి సర్కార్.. జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల విడుదలపై కీలక ప్రకటన చేసింది. జూన్ 1న సోమవారం తెల్లవారుజాము నుంచే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు ప్రకటించారు. కనుక లబ్ధిదారులు ప్రయాణాలు పెట్టుకోకుండా.. ఇంట్లోనే ఉండి తమ పెన్షన్ మొత్తాన్ని తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ జూన్ నెలలో ఏపీ వ్యాప్తంగా మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులకు ఈ సామాజిక భద్రతా పెన్షన్లు అందనున్నాయి. ఈసారి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త లేదా భార్య చనిపోయిన వారికి ఇచ్చే ‘స్పౌజ్ పెన్షన్లను’ లబ్ధిదారుల జాబితాలో మరో 5,606 మందిని చేర్చింది. ఈ నెల వారికి కూడా పెన్షన్ మంజూరు చేసింది. ఈ కొత్త స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లను ప్రభుత్వం అదనంగా విడుదల చేసింది. దీనివల్ల ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.