×
Ad

AP Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు బ్రేకింగ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది.. డేట్ ఇదే..

AP Govt : ఏపీలో నిరుద్యోగులకు బ్రేకింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై కసరత్తు ప్రారంభించింది. ఉగాధి నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది.

AP Govt

  • ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
  • జాబ్ క్యాలెండర్‌పై కూటమి సర్కార్ కసరత్తు
  • ఉగాది నాటికి శాఖల వారీగా ఖాళీ పోస్టుల వివరాల

AP Govt : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌పై కసరత్తు ప్రారంభించింది. శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. తద్వారా పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహించేందుకు కూటమి సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది.

Also Read : Tirumala Temple : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్… ఆరోజు ఆలయం మూసివేత.. వెళ్ళేటప్పుడు చూసుకోండి.

నిరుద్యోగుల కోసం 2026 జనవరిలోనే కచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కొద్దిరోజుల క్రితం ఓ కార్యక్రమంలో విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. దీంతో జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా.. ఏపీ ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. కేవలం 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తిచేసి టీచర్ పోస్టులను కూటమి సర్కార్ భర్తీ చేసింది. మరోవైపు ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులను సైతం కూమిటి ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీల జాబితా సేకరించి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

శాఖల వారీగా ఖాళీ పోస్టుల వివరాల నివేదిక వచ్చిన తరువాత.. ఉన్న ఖాళీలు, ఆర్ధిక శాఖపై పడేభారం అన్నీ బేరీజు వేసుకొని ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రతిఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చే విధంగా కసరత్తు చేస్తోంది. ఉగాధి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తరువాత వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.