గవర్నమెంట్ ఉద్యోగం అనే సరికి ప్రతి ఒక్కరికి అదొక భరోసా. అదృష్టం కొద్ది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఆలోచనలు మారిపోతాయి. గవర్నమెంట్ జాబ్ రాక ముందు ఒక యువతిని ప్రేమించి.. ఆమెతో హద్దులు దాటి ప్రవర్తించి.. గవర్నమెంట్ జాబ్ వచ్చాక మొహం చాటేసి, మరోక యువతిని పెళ్లి చేసుకోటానికి సిధ్ధమయ్యాడో ప్రబుధ్దుడు.
విశాఖ జిల్లా చింతపల్లి పంచాయతీ పరిధిలోని అంతర్ల గ్రామానికి చెందిన యువతి (21) అదే గ్రామానికి చెందిన కోరాబు కోటి కిరణ్ అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమతో బాగా చనువు తీసుకున్న కిరణ్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు.
ఈ లోగా… గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షలో కిరణ్ ఎంపికయ్యాడు. గూడెం కొత్త వీధి మండలం.. గాలికొండ సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయకుడిగా పోస్టింగ్ వచ్చింది. అక్కడ ఉద్యోగంలో చేరిన కిరణ్ తన సహోద్యోగిని పెళ్లి చేసుకునే ఏర్పాట్లలో ఉన్నాడు.
విషయం తెలుసుకున్న ప్రియురాలు కిరణ్ ను నిలదీసింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. ఆమెను చేసుకోటానికి కిరణ్ ససేమిరా అన్నాడు. కిరణ్ చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి చింతపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.