Gun firing on sarpanch In AP: శ్రీకాకుళం జిల్లాలో అర్థరాత్రి సర్పంచ్ పై కాల్పులు..!

శ్రీకాకులం జిల్లాలో అర్థరాత్రి తుపాకుల మోత మోగింది. తుపాకీ కాల్పులతో రామచంద్రాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామస‌ర్పంచ్ పై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల కాల్పులు జరిపారు

Gun firing on Ramchandrapuram sarpanch in AP: శ్రీకాకులం జిల్లాలో అర్థరాత్రి సమయంలో తుపాకుల మోత మోగింది. తుపాకీ కాల్పులతో రామచంద్రాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామ స‌ర్పంచ్ పై అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని ఇద్ద‌రు వ్య‌క్తుల‌ు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘటనలో సర్పంచ్ వెంకటరమణకు స్వల్పంగా గాయాలయ్యాయి. రామ‌చంద్రాపురం స‌ర్పంచ్ వెంక‌టర‌మ‌ణ వ‌ద్ద‌కు మంగ‌ళ‌వారం రాత్రి ఓ మ‌హిళ వ‌చ్చింది. మ‌ధురాన‌గ‌ర్ లోని స‌ర్పంచ్ కార్యాల‌యం వ‌ద్ద ఉన్న వెంట‌క‌ర‌మ‌ణ వ‌ద్దకే వెళ్లింది. ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా స‌ర్పంచ్ వెంకటరమణ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు.

Also read : south africa : లక్షల కోవిడ్ కేసులు, లక్ష మంది చనిపోయినా..నో లాక్‌డౌన్‌ అంటున్న ప్రభుత్వం

ఈక్రమంలో సదరు మహిళ స‌ర్పంచ్ తో మాట్లాడుతుండగా సడెన్ గా ఆమెకూడా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెంకటరమణపై కాల్ప‌ులు జరిపారు. ఈ ఘటనలో స‌ర్పంచ్ కు గాయాలు అయ్యాయి. కాల్పులు జ‌రిపిన వెంట‌నే దుండ‌గులు అక్కడ నుండి పారిపోయారు. కాల్పుల మోతకు స్థానికులు పరుగు పరుగున ఘటనాస్థలికి చేరుకునే సరికి కాల్పుల షాక్ నుంచి కోలుకోనేలేదు సర్పంచ్. గాయాలతో అక్కడే కుప్పకూలిపోయిన సర్పంచ్ ను స్థానికులు వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Also read : Covid-19 In AP : ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూల్లో 17 పాజిటివ్‌ కేసులు

ఈ అనూహ్య ఘటనపై స్థానికులు వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో హుటాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. రెండు బుల్లెట్ల‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సర్పంచ్ వద్దకు వచ్చిన ఆ మహిళ ఎవరు? ఆమె కూడా వచ్చినవారు ఎవరు? ప్లాన్ ప్రకారమే ఈ కాల్పులు జరిగాయా? కాల్పుల వెనుక ఉన్న కారణమేంటి? ఎవరు చేయించారు? పాత కక్షలేమైనా ఉన్నాయా? లేదా సర్పంచ్ వద్దకు వచ్చిన మహిళకు ఆమె కూడా వచ్చినవారికి ఉన్న సంబందమేంటి? ఈ కాల్పుల్లో ఆమె భాగస్వామ్యం ఉందా? అనే పలు కీలక కోణాలల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా అర్థరాత్రి సర్పంచ్ పై కాల్పులతో ఊరంతా ఉలిక్కిపడింది. తీవ్ర ఆందోళన నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు