Covid-19 In AP : ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూల్లో 17 పాజిటివ్‌ కేసులు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.15 మంది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు సిబ్బందికి కోవిడ్‌ సోకింది..

Covid-19 In AP : ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూల్లో 17 పాజిటివ్‌ కేసులు

Covid 19 In Ap

17 corona positive cases same school in AP Govt schools : ఏపీలో కోవిడ్ తీవ్ర స్థాయిలో కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా స్కూల్స్ కొనసాగించటంతో విద్యార్ధులకు కరోనా సోకుతోంది. ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు నమోదు కావటం ఆందోళనకు కలిగిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో జనవరి చివరి వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఏపీలో మాత్రం పండుగ తరువాత కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి…

ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది.. జిల్లాలో మంగళవారం (జనవరి 18,2022) ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది..కోవిడ్ సోకినవారిలో 15 మంది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు సిబ్బందికి కోవిడ్‌ సోకింది..

ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి కరోనా సోకింది. ఒంగోలు కేంద్రీయ విద్యాలయ, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్, కనిగిరి నందన మారెళ్ల, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు, పంగులూరు మండలం రేణిగంవరం, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, యద్దనపూడి మండలం యనమదల, గన్నవరం ఎంపీపీఎస్ స్కూళ్లలో ఒక్కక్కరికి టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. త్రిపురాంతకం మండలం మేడపి, యద్దనపూడి మండలం పూనూరు స్కూళ్లలో బోధనేతర సిబ్బందికి కోవిడ్‌ సోకింది.

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో 38,055 శాంపిల్స్ ని పరీక్షించగా 6,996 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2117384కి చేరింది. అలాగే భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8 వేల 916కు చేరింది. కొత్తగా కోవిడ్ కేసులు 2లక్షల 82 వేల 970 కేసులు నమోదయ్యాయి. 441 మరణాలు సంభవించాయి.