AP Health Minister Vidadala Rajini Visit Diarrhea Patients in Guntur
Minister Vidadala Rajini : గుంటూరులో డయేరియా ప్రబలుతోంది. నగరంలో అనేక మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. వివిధ ఆస్పత్రులలో చేరి డయేరియా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యంతో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది బాధితులు జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీజీహెచ్‌లో డయేరియా బాధితులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
పరామర్శించారు.
Read Also : Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవిగో
ఈ క్రమంలో ఆమెను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. మహిళా మంత్రిగా డయేరియా బాధితులను పరామర్శించేందుకు వస్తే రౌడీయిజం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దాదాపు 20 మంది డయేరియా బాధితులు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రికి వచ్చారని అందరికి మెరుగైన వైద్యం అందించినట్టు తెలిపారు.
అన్ని చర్యలు తీసుకుంటాం :
ఎవరూ వచ్చిన చికిత్స చేసేందుకు వైద్యులు సిద్దంగా ఉన్నారని అన్నారు. వాంతులు, విరోచనాలకు కారణాలను వెరిఫై చేస్తున్నారని, క్లోరినేషన్ సక్రమంగా చేస్తున్నారని చెప్పారు. బాధ్యత గలిగిన ప్రభుత్వంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి రజిని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న లక్షణాలు మేరకు వైద్యం చికిత్స అందిస్తున్నారని అన్నారు.
గత 2018లో డయేరియా వచ్చిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 24 మంది చనిపోయారని ఆమె గుర్తు చేశారు. అది డయేరియా… ఆ విషయం టీడీపీ నాయకులు తెలుసుకోవాలని హితువు పలికారు. డయేరియా వస్తే.. ఒక ఫ్యామిలి మొత్తానికి బజారుకు వస్తుందని, ఈ విషయంలో టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
Read Also : YSRCP: పలు పార్లమెంట్ నియోజక వర్గాలు, జిల్లాల కోఆర్డినేటర్లను నియమించిన వైసీపీ