Cji Nv Ramana
CJI Ramana: హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్ అసోసియేషన్ సంయుక్తంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణకు సన్మానం నిర్వహించారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సతీసమేతంగా విచ్చేశారు. ఏపీ హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమానికి హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్, జడ్జిలు, అడ్వకేట్‌లు హాజరయ్యారు.
సన్మాన కార్యక్రమంలో సీజేఐ రమణ ఈ విధంగా మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాక కొవిడ్ ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలకు రాలేకపోయాను. నామీద మీరు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు. న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులు. సమాజాన్ని నడిపించాలి. అన్ని హైకోర్టులలో న్యాయమూర్తుల కొరత వుంది. ఆ లోటు తీరుస్తాం’ అని అన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ పీఎస్. నర్సింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
rEAD aLSO : పెంచిన టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా – నట్టి కుమార్..
అదే విధంగా రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టుకు వస్తున్న సమయంలో సీజేఐ ఎన్వీ రమణకు మార్గం మధ్యలో అమరావతి రైతులు పూలు జల్లి ఘన స్వాగతం పలికారు.