AP High Court : టెట్‌, డీఎస్సీ రీషెడ్యూల్‌పై హైకోర్టులో విచారణ.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ!

AP High Court : రెండు పరీక్షల మధ్య సమయం ఉండేలా షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

AP High Court Denies to give interim orders over AP Tet and DSC Exam

AP High Court : టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఇవ్వలన్నా పిటిషన్‌ను ఏపీ హైకోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 23) విచారణకు స్వీకరించింది. పరీక్షల షెడ్యూల్‌ మార్చాలనే పిటిషన్‌పై విచారించిన అనంతరం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. దీనికి సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. టెట్‌, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవలే వరుసగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ రెండు పరీక్షలకు మధ్య సరైన సముచిత సమయం ఇవ్వకుండానే హడావిడిగా ప్రభుత్వం నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గడువు కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇటీవలే టెట్‌, డీఎస్సీ పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని విచారణను వాయిదా వేసింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారించిన ఏపీ హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read Also : AP-TET Hall Ticket Download 2024 : ఏపీ టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!