AP High Court
Central Law Department : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రతిపాదన అనేది ప్రస్తుతం పెండింగ్ లో లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. లోక్ సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇచ్చిన రాత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
హైకోర్టు తరలింపు గురించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సివుందన్నారు. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. 2014 ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటై 2019 జనవరి 1 నుంచి పని చేస్తుందన్నారు.
Gummanuru Jayaram : లోకేష్ పాదయాత్ర ఎక్కడ జరుగుతుందో ఆయనకే తెలియదు : మంత్రి గుమ్మనూరు
2020లో ఏపీ హైకోర్టు అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించారని, రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సివుంటుందని వివరించారు.