Bandaru Satyanarayana : హైకోర్టులో బండారు సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ, పోలీసులకు కీలక ఆదేశాలు

తన తప్పేమీ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బండారు సత్యనారాయణ.

Bandaru Satyanarayana Petition

Bandaru Satyanarayana Petition : మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేత బండారు సత్యనారాయణ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని బండారు సత్యనారాయణను ఆదేశించింది. అలాగే అరెస్ట్ సమయంలో తీసిన వీడియోలు ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేసింది.

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి రోజాను దూషించారని వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బండారు సత్యనారాయణ మూర్తికి రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Also Read : చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదని అమిత్ షా చెప్పారు : నారా లోకేశ్

తన అరెస్ట్ పరిణామాలపై బండారు సత్యనారాయణ హైకోర్టుని ఆశ్రయించారు. బండారు పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కాగా, తన తప్పేమీ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బండారు సత్యనారాయణ.

ట్రెండింగ్ వార్తలు