AP High Court : మూడు రాజధానుల పిటిషన్లపై నేటి నుంచి ఏపీ హైకోర్టు విచారణ

మూడు రాజధానుల పిటిషన్‌లపై ఏపీ హైకోర్టు నేటి నుంచి విచారణ జరపనుంది. ధర్మాసనం హైబ్రిడ్‌ పద్ధతిలో విచారణను మొదలెట్టబోతుంది.

AP three capital petitions : మూడు రాజధానుల పిటిషన్‌లపై ఏపీ హైకోర్టు నేటి నుంచి విచారణ జరపనుంది. హైబ్రిడ్‌ పద్ధతిలో ధర్మాసనం విచారణను మొదలెట్టబోతుంది. ఈ మేరకు వాదనలు సిద్ధం చేసుకోవడంతో పాటు రోజువారీ విచారణకు హాజరవ్వాలని న్యాయవాదులకు హైకోర్టు ధర్మాసనం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. వ్యక్తిగత కారణాలతో వాయిదాలకు అవకాశం ఇవ్వమని స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో పిటిషనర్లతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలను మరోసారి హైకోర్టులో వినిపించనున్నాయి. ఇప్పుడు రోజువారీ విచారణ ప్రారంభం కానుండడంతో ఏం జరుగుతుందో? అనేది ఆసక్తిగా మారింది.

ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ రెండుసార్లు ప్రారంభమై నిలిచిపోయింది. ఈ రెండుసార్లూ చీఫ్ జస్టిస్‌లు జేకే మహేశ్వరి, అరూప్ గోస్వామి బదిలీలే కారణమయ్యాయి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ విచారణ ప్రారంభం కాబోతోంది. ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి వాదనలు విననుంది.

Sabarimala Temple : నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం..కరోనా నెగెటివ్ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి

అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిరసనగా రైతులు ప్రారంభించిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. అమరావతే ఏకైక రాజధాని ఉండాలంటూ రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో హైకోర్టులో విచారణ జరుగుతుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించి ఈ డిసెంబర్‌కు రెండేళ్లు పూర్తవుతాయి.

ట్రెండింగ్ వార్తలు