Amaravati Farmers Padayatra : అమరావతి రైతుల పాదయాత్ర.. హైకోర్టు కీలక ఆదేశం

అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాదయాత్రలో సడలింపులను కోరుతూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను, అటు పాదయాత్రను రద్దు చేయాలని డీజీపీ వేసిన పిటిషన్ రెండింటిని కొట్టేసింది.

Amaravati Farmers Padayatra : అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాదయాత్రలో సడలింపులను కోరుతూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను, అటు పాదయాత్రను రద్దు చేయాలని డీజీపీ వేసిన పిటిషన్ రెండింటిని కొట్టేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని రైతులకు తేల్చి చెప్పింది న్యాయస్థానం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ధర్మాసనం ఇచ్చిన షరతులకు లోబడే పాదయాత్ర కొనసాగాలని స్పష్టం చేసింది. పాదయాత్రలో పాల్గొనకుండా మరే రకంగా అయినా సంఘీభావం తెలపొచ్చన్న న్యాయస్థానం.. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డులైనా పోలీసులు వచ్చినప్పుడు చూపించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించరాదని రైతులను హెచ్చరించింది కోర్టు. అంతేకాదు, రైతులు షరతులు ఉల్లంఘిస్తే డీజీపీ హైకోర్టును ఆశ్రయించొచ్చని కోర్టు స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు