Ashok Gajapathi Raju : సింహాచల ఆలయ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్ గజపతి రాజు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది.

Ashok Gajapathi Raju : ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. గజపతి రాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్దరించాలని ఆదేశాల్లో పేర్కొంది. జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్ దాఖలు చేశారు.

విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన సంచయిత గజపతిరాజు నియామక జీవో 72ను రద్దు చేసింది. వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్‌కు ఆయనే చైర్మన్‌గా ఉండేలా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

గతంలో మాన్సాస్ ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్  ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్‌గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు.

మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదని సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పును ఏపీ సర్కార్ సవాల్ చేయనుంది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు ఏపీ ప్రభుత్వం వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు