Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక కేసులు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా

ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది.

Chandrababu

Chandrababu anticipatory bail petition : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరపున ఏజీ వాదనల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణను చేపట్టింది. తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది.

అలాగే ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు చంద్రబాబు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం నవంబర్ 30కి వాయిదా వేసింది.

CM Jagan : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టులో ఇప్పటికే చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు వినిపించారు. తాజాగా సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీఐడీ 470 పేజీలతో కూడిన అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని అఫిడవిట్ లో పేర్కొంది. మాస్టర్ ప్లాన్ లో అవకతవకలు జరిగాయని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు