లేఖలు లీక్.. ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

గవర్నర్‌ కు తాను రాసిన లేఖలు, గవర్నర్ ప్రత్యుత్తరాలు లీక్ కావడంపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఏపీ మంత్రులు

ap highcourt notices : గవర్నర్‌ కు తాను రాసిన లేఖలు, గవర్నర్ ప్రత్యుత్తరాలు లీక్ కావడంపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి(మార్చి 30) కోర్టు వాయిదా పడింది.

తాను రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ గవర్నర్ కార్యాలయం నుంచి ఎలా బయటికి వస్తున్నాయో తెలుసుకోవాలని ఎస్ఈసీ తన పిటిషన్ లో కోరారు. ప్రివిలేజ్ లెటర్స్ లీక్ కాలేదని గవర్నర్ కార్యాలయం కార్యదర్శి చెబుతున్నారని, మరి ఆ లేఖలు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయన్నది తేల్చాలని విజ్ఞప్తి చేశారు. పైగా ఆ లేఖలను సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని, తన లేఖలు సోషల్ మీడియాలోకి రావడం ఎలా సాధ్యమో గుర్తించాలని నిమ్మగడ్డ కోరారు.