AP Inter Exams: మారిన ఎపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్

ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(Inter Public Exams) ఏపీ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

AP Inter Exams: ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(Inter Public Exams) ఏపీ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను జాతీయ పరీక్షల మండలి (NTA) విడుదల చేసిన తర్వాత మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మొదలై మే 12వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం గతంలో ప్రకటించినట్టుగానే మార్చి 11వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు జరగనున్నాయి.

కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షల నిర్వహణ ఉంటుందని, బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 1400 కేంద్రాలు పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, 900 ల్యాబ్ పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు.

ఇన్విజిలేషన్ సిబ్బంది సమస్య లేదు. 10 తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు