AP Covid Update : ఏపీలో కొత్తగా 186 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 186 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
- chvmurthy
- Published On : December 4, 2021 / 05:52 PM IST
Ap Covid Cases
AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 186 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్నటి కంటే 48 కేసులు నేడు పెరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 32 మంది… కృష్ణా జిల్లాలో 28 మందికి… పశ్చిమగోదావరి జిల్లాలో 26… మందికి కోవిడ్ సోకింది. కోవిడ్ నుంచి నిన్న 191 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Also Read :Cyclone Jawad : జొవాద్ తుపాను ఎఫెక్ట్-కొబ్బరిచెట్టు పడి బాలిక మృతి
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,576 కి చేరింది. వీరిలో 20,56,979 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ వల్ల నిన్న కృష్ణా, గుంటూరు, విశాఖజిల్లాలో ఒక్కోక్కరు మరణించటంతో ఇంతవరకు కోవిడ్ వల్ల రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 14,448కి చేరింది. నిన్నటి వరకు రాష్ట్రంలో 3,05,39,041మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Ap Covid Cases Up Date
