Ap Covid Update
AP Covid Update : ఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో నిన్న కొత్తగా 69 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఇదే సమంయలో 139 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 817 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇంతవరకు రాష్ట్రంలో 3,32,01,596 శాంపిల్స్ పరీక్షించగా 23,18,547 మందికి కోవిడ్ సోకింది. వీరిలో 23,03,001 మంది వ్యాధికి చికిత్స పొంది కోలుకున్నారు.
Also Read : Minor Girl Rape : కిషన్‌బాగ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసు చేధించిన పోలీసులు
కాగా కోవిడ్ తదితర కారణాలతో 14,729 మంది కన్ను మూశారు. నిన్న రాష్ట్రంలో ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు. కడప, కర్నూలు జిల్లాల్లో కోవిడ్ ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.