టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి రూ.100 కోట్ల జరిమానా

  • Publish Date - December 1, 2020 / 11:03 AM IST

Jc Divakarreddy fine Rs 100 crore : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఏపీ మైనింగ్ శాఖ వంద కోట్ల భారీ జరిమానా విధించింది. 14 లక్షల టన్నుల లైమ్‌స్టోన్ అక్రమ తవ్వకాలకు పాల్పడినందుకు గానూ వంద కోట్ల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. రూ. 100 కోట్ల జరిమానా కట్టకపోతే ఆర్అండ్ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరించింది.



త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో యాడికి మండలం కోన ఉప్పలపాడులో జేసీ అక్రమాలకు పాల్పడినట్టు మైనింగ్ శాఖ గుర్తించింది. విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు.


https://10tv.in/covid-positive-cases-in-andhra-pradesh/
డ్రైవర్లు, పనివాళ్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్‌ అనుమతులు పొందిన జేసీ… ఆ తర్వాత కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయించినట్టు దర్యాప్తులో తేలింది.