Gudivada Amarnath : జగన్‌ను చూసి పవన్ ఇన్‌స్పైర్ అవ్వాలి, అక్కడ ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుంటే గీతం ఆక్రమణలు కనిపించేవి- మంత్రి అమర్నాథ్

కాల్ మనీలో మహిళలను వేధించినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? Gudivada Amarnath - Pawan Kalyan

Gudivada Amarnath - Pawan Kalyan (Photo : Google)

Gudivada Amarnath – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర భూములు దోచేస్తున్నారు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ఎదురుదాడికి దిగుతున్నారు. పవన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్.. పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు.

” పవన్ కొండను తవ్వి వెంట్రుక కూడా పీకలేకపోయారు. ముఖ్యమంత్రి స్థానంలో జగన్ ని చూడలేక ఇలా మాట్లాడుతున్నారు. జగన్ మీద మా ప్రభుత్వం మీద మీకున్న ద్వేషం ఏమిటి..? మొన్న రుషికొండ వెళ్లి సాధించింది ఏమీ లేదు. అక్కడ ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చి ఉండి ఉంటే.. పవన్ కు గీతం ఆక్రమణలు కనిపించేవి. 43 ఎకరాలు కబ్జా చేశారు. అప్పుడు నువ్వు నీ డాడీ చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేదు..? జగన్ ను చూసి పవన్ ఇన్ స్పైర్ అవ్వాలి. పవన్ తన తోటి హీరోలని చూసి ఈర్ష్య పడాలి. నీలాంటి కథానాయకుడు వచ్చి ప్రజా నాయకుడిపై ఈర్ష్య పడటం విడ్డూరంగా ఉంది.

Also Read..Galla Family: గల్లా కుటుంబం తరుఫున ఎవరు పోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

విస్సన్నపేట భూములకు సంబంధించిన బాధితులు ఎవరైనా నీకు ఒక్క ఫిర్యాదైనా చేశారా? విస్సన్నపేట భూములకు చంద్రబాబు హయాంలో పరిహారం ఇచ్చారు. ప్రభుత్వ భూమి అయితే పరిహారం ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఆ పరిహారం ఇవ్వడమే తప్పు అయితే ఆ తప్పు పవన్ డాడీ చంద్రబాబుదే.

పవన్.. మీ నాన్న కానిస్టేబుల్ కాక ముందు మా తాత ఎమ్మెల్యే. చిరంజీవికి మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి నువ్వు. మా నాన్న చనిపోయాక నేను రాజకీయాల్లోకి వచ్చి కష్టపడ్డాను. పవన్ ఒక కీచక గురువు. క్రమశిక్షణ లేని వారు జనసేనలో ఉన్నారు. నమ్మి వెనక తిరుగుతున్న వారిని మూటకట్టి చంద్రబాబుకి అమ్మేస్తాడు. జనసేన నాయకులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయద్దు. జనసేనకు పెట్టిన ఖర్చు దండగ.

Also Read..Bonda Uma : వైసీపీ 175కి 175 సీట్లు గెలిస్తే మా పార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

బుద్దా వెంకన్న ఓ అనకొండ. కాల్ మనీలో మహిళలను వేధించినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? బుద్దా వెంకన్న కొండలు మింగిన అనకొండ. భూములకు ఉపాధికి సంబంధం ఏంటి? పరుచూరి భాస్కరరావును చూస్తే జాలి వేస్తుంది. అనకాపల్లిలో అనవసరమైన ఖర్చు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా పవన్ సాధించేది ఏమీ లేదు. కొంతమంది కేఏ పాల్ పార్టీలో చేరుతారు. కొంతమంది జనసేనలో చేరతారు. పెద్ద తేడా ఏమీ లేదు” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.