Minister Peddireddy responded to the SEC actions : ఎస్ఈసీ చర్యలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. అయితే నిన్నటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఎస్‌ఈసీ ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడనని తెలిపారు. నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల అధికారి చట్టబద్ధంగా వ్యవహరించకుంటే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పంచాయతీ మంత్రి తానే కాబట్టి నిమ్మగడ్డ తనతో మాట్లాడకుండా… చంద్రబాబుతో మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
ఏపీ పంచాయతీ మంత్రి తాను కాబట్టి తనతో మాట్లాడాలి..కానీ నిమ్మగడ్డ.. చంద్రబాబుతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నిమ్మగడ్డ చేస్తున్నారని తెలిపారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పారు. పంచాయతీలు ఏకగ్రీవం అయితే నిధులు వస్తాయని వెల్లడించారు.