AP Minister Perni Nani: ఆర్టీసీకి ప్రైవేట్ బంకుల్లో ఇంధనమే మేలు – మంత్రి పేర్ని నాని

నాని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అంతర్గత అంశాలపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై వివరణ ఇచ్చారు.

Perni Nani Apsrtc

AP Minister Perni Nani: ఏపీ మంత్రి పేర్ని నాని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అంతర్గత అంశాలపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై వివరణ ఇచ్చారు.

‘ఏపీఎస్ ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపట్టనున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో 1800లకు పైగా కారుణ్య నియామకాలు జరపాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు’

‘ఆర్టీసీ బస్సుల కోసం నెలకు 8 లక్షల లీటర్లు ఆయిల్ వాడాల్సి వస్తుంది. కేంద్రం నుంచి కొనే ఆయిల్ ధరల్లో మార్పులు రావడంతో 15 రూపాయల వరకూ అధికంగా భరించాల్సి వస్తుంది. దాంతో పోల్చి చూస్తే బయటి ధరల్లోనే ఆయిల్ ధర తక్కువగా ఉంది’.

Read Also : బస్సుల్లో మాస్కు లేకపోతే ఫైన్..! ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ

కేంద్రం కంటే లోకల్ బెటర్
అందుకే బయట బంకుల్లో కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఇప్పటికే కోటిన్నర వరకూ ప్రభుత్వానికి మిగిలింది. ఇలా కేంద్రం నుంచి కాకుండా బయట కొనడం వల్ల నెలకు 33కోట్ల 83లక్షల వరకూ మిగలొచ్చని అంచనా.

ఎలక్ట్రిక్ బస్సులు:
ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే నడిపే ఆలోచనలో ఉన్నాం. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుండి నెల్లూరు, తిరుపతి, మదనపల్లి కి మొదట ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతాం.

25శాతం రాయితీ:
కోవిడ్ దృష్ట్యా ఆర్టీసీలో సీనియర్ సిటిజన్ లకు ఆపేసిన 25 శాతం రాయితీ ఏప్రిల్ నుండి పునరుద్ధరిస్తాం. 2021- 22 సంవత్సరంలో కోవిడ్ దృష్ట్యా 658 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్డీసికి వచ్చింది.

ఉద్యోగులకు చెల్లించేశాం:
ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ తదితర సేవింగ్స్ గతంలో ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. వాటిని అన్నింటినీ చెల్లించాం.