APSRTC : బస్సుల్లో మాస్కు లేకపోతే ఫైన్..! ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ
ఆర్టీసీ బస్సుల్లో మాస్కు లేకుంటే స్పాట్ లోనే జరిమానా విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది.

APSRTC : ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధిస్తూ సీఎం జగన్ పలు ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఆర్టీసీ బస్సుల్లో మాస్కు లేకుంటే స్పాట్ లోనే ప్రయాణికులకు జరిమానా విధిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది.
ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పింది. మాస్కు లేకపోతే జరిమానా అనే నిబంధన నిజమే.. కానీ, అది బస్సుల్లో కాదని, బస్ స్టేషన్లలో అని వివరణ ఇచ్చింది. బస్ స్టేషన్లలో నిబంధనలు పాటించని వారికి మాత్రమే ఫైన్లు విధిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్ స్టేషన్లలో మాస్కుల్లేకుండా కనిపిస్తే జరిమానా విధిస్తున్నామని చెప్పారు. బస్సుల్లో మాస్కులు లేనివారికి జరిమానాలు విధించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే నూతన కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో.. బస్సుల్లో కూడా ప్రతి ప్రయాణికుడు మాస్కు ధరించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాస్కు ధరించాల్సిందిగా సూచించారు.
Covid-19: జలుబు వచ్చిందా.. కొవిడ్ నుంచి ప్రొటెక్షన్ వచ్చినట్లే
సంక్రాంతి సీజన్ ను దృష్టిలో ఉంచుకుని భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులు తిప్పుతున్నామని, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో బస్ స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన చేసింది. బస్ స్టేషన్ ఆవరణలోనూ, పరిసరాల్లోనూ ఇష్టం వచ్చినట్టు వాహనాలు పార్క్ చేసి ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది కలిగించినా, బస్ స్టేషన్ లోనూ, పరిసరాల్లోనూ మాస్కులు లేకుండా తిరిగినా, బహిరంగ మూత్రవిసర్జన చేసినా చర్యలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అంతే తప్ప బస్సుల్లో మాస్కు లేకుండా ఎక్కిన ప్రయాణికులకు మాత్రం ఎటువంటి ఫైన్లు విధించలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ICICI Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు
- RTC Driver Died : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు..బస్సులోనే మృతి
- Facebook: ఫేస్‌బుక్‌కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?
- APSRTC Strike : ఏపీలో ఆర్టీసీ సమ్మె.. నిలిచిపోనున్న బస్సులు!
- Minister Not wearing mask: ‘మాస్కు’ ధరించడం తప్పనిసరేం కాదు.. అది వ్యక్తిగత నిర్ణయం: కర్ణాటక మంత్రి
- 50 Lakh Fine: మాస్కుల్లేని ప్రయాణికుల నుంచి రూ.50లక్షలు వసూలు చేసిన రైల్వేశాఖ
1Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
2CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
3TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
4Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
5Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
6Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
7Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
8RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
9World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
10BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్