Covid-19: జలుబు వచ్చిందా.. కొవిడ్ నుంచి ప్రొటెక్షన్ వచ్చినట్లే

సెల్స్ ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల కరోనా వైరసెస్ నుంచి రక్షణ పొందొచ్చని లండన్ లోని ఇంపీరియల్ కాలేజి జరిపిన స్టడీలో తేలింది.

Covid-19: జలుబు వచ్చిందా.. కొవిడ్ నుంచి ప్రొటెక్షన్ వచ్చినట్లే

Corona Virus

Covid-19: T- సెల్స్ ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల కరోనా వైరసెస్ నుంచి రక్షణ పొందొచ్చని లండన్ లోని ఇంపీరియల్ కాలేజి జరిపిన స్టడీలో తేలింది. కొవిడ్-19 లాంటి కాంప్లెక్స్ పిక్చర్ ను తట్టుకునే ఇమ్యూనిటీ రావాలంటే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అలా ఆరు నెలల పాటు ప్రొటెక్షన్ దక్కుతుండగా.. రీసెంట్ గా టీ సెల్స్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తాయని చెబుతున్నారు స్టడీ నిర్వాహకులు.

సెప్టెంబర్ 2020లో మొదలైన స్టడీలో సాధారణ జలుబు ఎదుర్కొన్న 52మంది కొవిడ్ పాజిటివ్ పేషెంట్లు పాల్గొన్నారు. 26మందిలో కొవిడ్ ఇన్ఫెక్షన్ లెవల్స్ ఎక్కువ స్థాయిలో పెరగలేదు. టీ-సెల్స్ శరీరంలో ఉన్నంత కాలం అది సాధ్యపడలేదు.

‘శరీరం స్వతహాగా సృష్టించే టీ సెల్స్ కరోనా వైరసెస్ లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఇస్తుంది. ఓ రకంగా సాధారణ జలుబు మనల్ని కాపాడుతుంది’ అని రచయిత డా. రియా కుండు అన్నారు.

ఇది కూడా చదవండి : జకోవిచ్‌‌కు ఊరట, అనుకూలంగా తీర్పు

నేచర్ కమ్యూనికేషన్స్ లో పబ్లిష్ అయిన స్టడీలో SARS-CoV-2లో ఉండే ఇంటర్నల్ ప్రొటీన్లు టీ సెల్స్ పై దాడి చేస్తాయి. అలా జరగడం వల్ల ఆ వ్యక్తిలో మ్యూటేషన్స్ అనేవి తక్కువ ఉత్పన్నమవుతాయి.