Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు

ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ ను ప్రశంసించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్, బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.

Roja

AP Minister Roja : మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని మంత్రి రోజా కొనియాడారు. నగరిలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే రోజా, ఎంపీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ ను ప్రశంసించారని తెలిపారు.

చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్, బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్… ఇంకా ఎంతమంది వచ్చినా సింహంతో ఆట, జగన్ తో వేట జరిగే పని కాదన్నారు.

Minister Roja: జూమ్ మీటింగ్‌లో లోకేష్ ఎందుకు పారిపోయారు: మంత్రి రోజా

రాష్ట్ర ప్రజల కోసమే కొన్ని అప్పులు చేస్తున్నామని తెలిపారు. అప్పు చేసే ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు.