AP Municipal Election Winners : ఏపీలో ఏకగ్రీవమైన మున్సిపాలిటీలు ఇవే.. విజయం సాధించిన అభ్యర్థులు వీరే..

AP Municipal Election Winners : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరులో కూటమి హవా కొనసాగుతోంది. ఇప్పటికే 17 స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు చైర్‌పర్సన్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

AP Municipal Election Winners

AP Municipal Election Winners : ఏపీలో స్థానిక స్థానిక సంస్థల ఎన్నిలక్లో భాగంగా తొలుత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మంగళవారం ఉదయం నుంచి కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, మున్సిపాలిటీల్లో ఫలితాల్లో అధికార కూటమి హవా సాగుతోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read : Case Registered Against YS Jagan : మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణాలివే..

ఏపీ వ్యాప్తంగా 13 కార్పొరేషన్లలోని మొత్తం 922 డివిజన్లలో 118 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. 804 డివిజన్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థలు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మున్సిపాలిటీల విషయానికొస్తే.. మొత్తం 87 చైర్ పర్సన్ స్థానాలు ఉండగా.. అందులో 17 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో టీడీపీ 15 స్థానాల్లో, జనసేన, బీజేపీలకు ఒక్కో స్థానంలో ఏకగ్రీవయ్యాయి. మిగిలిన 70 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగ్గా.. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

రాష్ట్రంలో ఏకగ్రీవమైన మున్సిపాలిటీలు ఇవే..
♦ పిండుగురాళ్ల మున్సిపాలిటీ (షేక్ బాబావలీ -టీడీపీ)
♦ గురజాల మున్సిపాలిటీ (నెలవల్లి బొల్లయ్య -టీడీపీ)
♦ దాచేపల్లి మున్సిపాలిటీ (తంగెళ్ల శ్రీనివాసరావు – టీడీపీ)
♦ కనిగిరి మున్సిపాలిటీ (అచ్చాల తిరుపతమ్మ రెడ్డి – టీడీపీ)
♦ నగరి మున్సిపాలిటీ ( ఇ. నారాయణ శ్రీనివాసన్ – టీడీపీ)
♦ పుంగనూరు మున్సిపాలిటీ ( నయీం తాజ్ – టీడీపీ)
♦ రాయచోటి మున్సిపాలిటీ (బోనుమల ఖాదర్‌వలీ – టీడీపీ)
♦ రాజంపేట మున్సిపాలిటీ (దొంతం గాయత్రి – టీడీపీ)
♦ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ (నంద్యాల రాఘవరెడ్డి – టీడీపీ)
♦ బద్వేలు మున్సిపాలిటీ (సోమేశుల దివ్యతేజ – టీడీపీ)
♦ మైదుకూరు మున్సిపాలిటీ (ధనపాల జగన్ మోహన్ -టీడీపీ)
♦ కమలాపురం మున్సిపాలిటీ (గొంగల్‌రెడ్డి స్వప్న – టీడీపీ)
♦ గుత్తి మున్సిపాలిటీ (గోవిందరాజుల తమిళ్ సెల్వి – టీడీపీ)
♦ ఆళ్లగడ్డ మున్సిపాలిటీ (షేక్ అనీషా -టీడీపీ)
♦ ఆత్మకూరు మున్సిపాలిటీ (డాక్టర్ ఆవుల గోవిందరాజులు – టీడీపీ)
♦ ఎర్రగుంట్ల మున్సిపాలిటీ (గొర్ల మధులత – బీజేపీ)
♦ దర్శి మున్సిపాలిటీ (దారం సుబ్బారావు – జనసేన)