పంచాయతీ ఎన్నికలు : ఎమ్మెల్సీ దొరబాబు కారు ధ్వంసం

MLC Dorababu car : ఏపీలో పంచాయతీ ఎన్నికలు టెన్షన్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి 2021, జనవరి 31వ తేదీ ఆదివారం ఆఖరి రోజు కావడంతో..భారీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు వచ్చారు. పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేగింది.

కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో దొరబాబు కారుతో పాటు..10కి పైగా ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. యాదమర్రి ఎంపీడీవో కార్యాయలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించడానికి వెళ్లిన సమయంల ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలే చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఘటనకు సంబంధించి దృశ్యాలన్నీ..సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్లు దాఖలు చేయడానికి 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం గడువు ముగిసింది. అయితే..చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా ఘర్షణలు తలెత్తాయి. యాదమర్రి మండలం ప్రాంతంలో ఓ పంచాయతీకి చెందిన దళిత మహిళను నామినేషన్ వేయకుండా..మూడు రోజులుగా అడ్డుకుంటున్నారని..దగ్గరుండి నామినేషన్ వేయించాలని ఎమ్మెల్సీ దొరబాబు భావించారని టీడీపీ వాదిస్తోంది. ఆయన కారుతో పాటు 15 నుంచి 20 ద్విచక్రవాహనాలు వెంట వచ్చాయి. కార్యాలయానికి చేరుకుంటారనగా..ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. వైసీపీ నేతలు చేసిన పనే అంటూ..టీడీపీ ఆరోపిస్తోంది.