AP Police: నేషనల్ లెవల్ టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు 165 అవార్డులు

టెక్నాలజీ సభ-2022లో భాగంగా ప్రకటించిన 15అవార్డులతో కలిపి మొత్తం 165అవార్డులను సొంతం చేసుకుంది ఏపీ పోలీస్ శాఖ. ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు..

Ap Police

AP Police: టెక్నాలజీ సభ-2022లో భాగంగా ప్రకటించిన 15అవార్డులతో కలిపి మొత్తం 165అవార్డులను సొంతం చేసుకుంది ఏపీ పోలీస్ శాఖ. ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు.. జాతీయ స్థాయిలో టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖ టాప్ 1లో నిలిచిందని పేర్కొన్నారు.

‘టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో ప్రజలకు సేవ చేసే బాధ్యత మాపై మరింతగా పెరిగిందని డీజీపీ అన్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ జిల్లాలో అవార్డులను సాధించిన సిబ్బందికి ఒక్కొక్కరుగా అభినందనలు తెలియజేశారు డీజీపీ.

జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరికీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రత్యేక అభినందనలు అందాయి. జిల్లాల వారీగా అవార్డులు అందుకున్న వివరాలిలా ఉన్నాయి. పోలీస్ ప్రధాన కార్యాలయం (8),అనంతపురం (1), చిత్తూరు (1), తిరుపతి అర్బన్ (2), కడప (1), ప్రకాశం (1), విజయవాడ సిటీ (1)గా సమాచారం.

Read Also: సినీ ఫక్కీలో పోలీస్ రియల్ ఛేజింగ్.. వైరల్ వీడియో!