ఏపీ పోలీస్ శాఖలో 6వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ ను ప్రకటించిన హోంమంత్రి సుచరిత

  • Publish Date - November 17, 2020 / 02:31 PM IST

AP Police recruitment 2021 : ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇకపై వినూతన పద్ధతిని అవలంభించనుంది. ఇక నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక నిర్థిష్ట సమయంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 2021 సంవత్సరానికి సంబంధించి పోలీస్ శాఖలో మెుత్తం 6 వేల 500 పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సుచరిత సోమవారం(నవంబర్ 16, 2020) న ట్వీట్ చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం జనవరిలోనే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని హోం మంత్రి సుచరిత వెల్లడించారు.



ఇటీవలనే సీఎం జగన్ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేస్తామని వెల్లడించిన విషయం విధితమే. దీంతోపాటు మిగతా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను అందజేయాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇక నుంచి పోలీస్ శాఖతోపాటే మిగతా అన్ని శాఖల ఉద్యోగాలకు ప్రతి ఏడాది జనవరిలో నోటిఫికేషన్లు విడుదల చేసి, ఉద్యోగ నియామకాలు పూర్తిచేసేలా రిక్రూట్మెంట్ క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచించారు.
https://10tv.in/100-feet-ysr-statue-in-polavaram-project-premises/


ఏపీ పోలీస్ శాఖలో నవంబర్ 2019 నాటికి 340 ఎస్సై, 11 వేల 356 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని అప్పట్లోనే పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ల విడుదలకు సరేనన్న ప్రభుత్వం, తాజాగా వాటి గడువును ప్రకటించటం విశేషం.



ట్రెండింగ్ వార్తలు