AP Politics : బీసీ ఓట్లే టార్గెట్ గా వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సీటు..!

ఈరోజు సాయంత్రానికి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపిస్తారు? అనే విషయం అధికారిక ప్రకటన రానుంది. ఈక్రమంలో బీసీ సంఘం నేత ఆర్. క్రిష్ణయ్యను వైసీపీ పెద్దల సభకు పంపనుంది. దీనికి సంబంధి సీఎం జగన్ క్రిష్ణయ్య పేరును ఖారారు చేశారు. తాడేపల్లిలో సజ్జలతో ఆర్ క్రిష్ణయ్య భేటీ కావటంతో ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు అయినట్లుగా పక్కా సమాచారం.

AP Politics : ఈరోజు సాయంత్రానికి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపిస్తారు? అనే విషయం అధికారిక ప్రకటన రానుంది. ఈక్రమంలో బీసీ సంఘం నేత ఆర్. క్రిష్ణయ్యను వైసీపీ పెద్దల సభకు పంపనుంది. దీనికి సంబంధి సీఎం జగన్ క్రిష్ణయ్య పేరును ఖారారు చేశారు. తాడేపల్లిలో సజ్జలతో ఆర్ క్రిష్ణయ్య భేటీ కావటంతో ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు అయినట్లుగా పక్కా సమాచారం. క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటును కట్టపెట్టడంలో వైసీపీ వ్యూహం పన్నింది. బీసీ ఓట్లను టార్గెట్ చేసినట్లుగా పక్కాగా తెలుస్తోంది. బీసీలకు పెద్దపీట వేస్తున్నామనే సంకేతాలను ఇవ్వటానికే సీఎం జగన్ ఆర్. క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీసీ సంఘం అధ్యక్షుడిగా సుదీర్ఖకాలంగా ఆర్.క్రిష్ణయ్యకు మంచి అనుభవం ఉంది. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికే ఈ వ్యూహ రచన చేసినట్లుగా తెలుస్తోంది.

Also read : YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఏపీ నుంచి మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాలీ అవుతున్నాయి. వాటికి సంబంధించి అప్పుడే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఆ నాలుగు సీట్లు అధికార వైసీపీకే దక్కనున్నాయి. దీంతో ఆశావాహుల జాబితా పెరిగింది. ఎవరికి వారు అధిష్టానం దగ్గర లాబీయింగ్ కూడా చేశారు. కానీ రాజ్యసభ ఎంపికకు సంబంధించి సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. వైసీపీ దక్కే నాలుగు రాజ్యసభ సీట్లలో ఎవర్ని రాజ్యసభలో కూర్చోబెట్టాలనే దానిపై పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపి ఫైనల్ చేశారని తెలుస్తోంది. పార్టీ సీనియర్లు సజ్జల,సుబ్బారెడ్డి,సాయిరెడ్డి, బొత్స తో చర్చించారు.
మొదట్లో చాలా పేర్లు తెరపైకి వచ్చిన ఆఖరి నిమిషంలో సీఎం జగన్ లెక్కలు మారిపోయాయి. దీంతో ఇద్దరు బీసీలను, ఇద్దరు రెడ్డిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లుగా నిర్ణయించారని తెలుస్తోంది. ఆ ఇద్దరు బీసీల నేపథ్యం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. గతంలో టీడీపీ సీఎం అభ్యర్థిగా ఉన్న ఆర్.క్రిష్ణయ్యకు రాజ్యసభ బెర్త్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అంతా ఖరారు అయిపోయినా ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంలో భాగంగానే వీరికి పదవులు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

Also read : Bihar : మూడు ఎకరాల భూమి కేసు..108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన కోర్టు !

ఇక ఇప్పటికి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పదవి కాలం ముగియడంతో మరోసారి ఆయనను రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది అందరూ మొదటి నుంచి ఊహించినదే. ఆయనకు రెన్యువల్ తప్పక ఉంటుందని అంతా భావించారు. అలాగే గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే జరిగినట్లుగా తెలుస్తోంది.

అలాగే సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది, నిర్మాత నిరంజన్ రెడ్డి కి అవకాశం ఇచ్చారు. మరో రెండు సీట్లలో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీదమస్తాన్ రావుకి ఒక్క సీటు, బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు ఇంకో సీటు వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రాజ్యసభ పై ఎంతో మంది అసలు పెట్టుకున్నప్పటికి జగన్ సింపుల్ గా రాజ్యసభ కు ఎవర్ని పంపాలి అనేదానిపై నిర్ణయం తీసేసుకున్నారు. ఇక అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు