AP PTD Employees Union : ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ 27వ మహాసభల పోస్టర్ రిలీజ్

ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక కూడా మహా సభలో జరుగుతుందన్నారు.

AP PTD Employees Union Mahasabha : ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ 27వ మహాసభలు మే24న విజయవాడలో జరుగనున్నాయి. ఈ మేరకు మహాసభల పోస్టర్ ను ఏపీ జెఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నేత వలిశెట్టి దామోదర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వలిశెట్టి దామోదర్ మాట్లాడుతూ రాష్ట్ర స్ధాయిలో 9వేల మంది మహాసభలకు హాజరవుతారని పేర్కొన్నారు. రవాణా శాఖా మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ హాజరవుతారని తెలిపారు.

ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక కూడా మహా సభలో జరుగుతుందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే యాజమాన్యం స్పందిస్తోందన్నారు. అనంతరం అమరావతి ఏపీజెఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శనివారం ఏపీ సీఎస్ ను కలిశామని.. ప్రధాన ఆర్ధిక డిమాండ్లు చర్చించాలని కోరామని పేర్కొన్నారు.

Bopparaju Venkateshwarlu : ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు : బొప్పరాజు వెంకటేశ్వర్లు

నాలుగు డీఏలు ఇవ్వాలి.. అవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఏపీ సీఎస్ కు అడిగినట్లు తెలిపారు. కొత్త పీఆర్సీ రికమండెడ్ పే స్కేళ్ళు బయటపెట్టి.. 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని కూడా ఏపీ సీఎస్ కు విన్నవించినట్లు పేర్కొన్నారు. అన్ని సంఘాల నాయకులతో ఆదివారం సాయంత్రం 7 గంటలకు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడు సంవత్సరాల తరువాత ఒప్పందం చేసుకున్న అంశాలను పరిష్కరించడం లేదన్నారు.

చాయ్ బిస్కట్ సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యమ బాట పట్టిన తరువాతే కారుణ్య నియామకాలు వచ్చాయని వెల్లడించారు. 525 కోట్ల రూపాయలు, పోలీసులకు సరండర్ లీవులు ఇవ్వడం కూడా ఉద్యమ ఫలితమేనని స్పష్టం చేశారు. మిగిలిన అంశాలు వచ్చే వరకూ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.

Bopparaju Venkateshwarlu : ఉద్యోగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఆందోళన : బొప్పరాజు వెంకటేశ్వర్లు

మూడవ ప్రాంతీయ సదస్సు ఏలూరులో మే27వ తేదీన జరుగుతుందని చెప్పారు. ఉద్యమమే ఫలితం ఇస్తుందని మిగతా సంఘాలు, ఉద్యోగులు కూడా గుర్తించాలన్నారు. APGEA ఉద్యమానికి తాము కూడా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. రానున్న పదిరోజుల్లో ప్రభుత్వంతో సమావేశం ఉండే అవకాశం ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు