AP Rains Alert : ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈ జిల్లాల్లో నేడు కుండపోత వర్షాలు.. పిడుగులు, భీకరగాలులు.. హైఅలర్ట్..
AP Rains Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి nభారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Published on- September 14, 2026 / 07:10 AM IST
AP Rains
AP Rains Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి nభారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండగా.. ఇవాళ కూడా ఆయా జిల్లాల్లో వర్షాల తీవ్రత ఉంటుందని, భీకర గాలులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : TTD: తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు.. కన్ఫ్యూజన్ లో భక్తులు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే కొద్దిగంటల్లో రాజస్థాన్ , గుజరాత్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ (సోమవారం) రాష్ట్రంలోని.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అదేవిధంగా.. నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలతోపాటు భీకర గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు వివిధ పంటలు సాగు చేశారు. కొద్దిరోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో అవి ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణంపోసి రైతులకు ఊరట కలిగించాయి.
