AP New Covid-19 cases : ఏపీలో కొత్తగా 11, 766 పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 11, 766 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (9AM-9AM) 45, 581 సాంపిల్స్ పరీక్షించగా తాజాకేసులు నిర్ధారణ అయ్యాయి.

AP New Covid-19 cases : ఏపీలో కొత్తగా 11, 766 పాజిటివ్ కేసులు

Ap Covid Case Update

Updated On : April 23, 2021 / 7:09 PM IST

AP New Covid-19 cases : ఏపీలో కొత్తగా 11, 766 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (9AM-9AM) 45, 581 సాంపిల్స్ పరీక్షించగా తాజాకేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4,441మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకునిసంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. కోవిడ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొత్తం 38 మంది మరణించారు.

కోవిడ్ వల్ల నెల్లూరులో 6, చిత్తూరులో 5 తూర్పు గోదావరి,కృష్ణా, కర్నూలు ,ప్రకాశం,శ్రీకాకుళం జిల్లాలో నలుగురేసి చొప్పున, విశాఖపట్నంలో 3, గుంటూరు, విజయనగరం జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,58,80,750 సాంపిల్స్ ను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.

Ap Covid Bulletin