AP Corona Cases : ఏపీలో కరోనా ఖతమ్..! కొత్తగా 182 కేసులు

ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 249 కరోనా పరీక్షలు చేయగా..

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఖతమ్ అయినట్టేనా? తాజాగా నమోదైన కేసుల సంఖ్య చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 249 కరోనా పరీక్షలు చేయగా 182 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో చిత్తూరు జిల్లాలో మరొకరు మరణించారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో 950 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,16,467. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,95,768. రాష్ట్రంలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,985. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14వేల 714కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,29,31,889 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Covid Rules : కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే రూ.25వేలు ఫైన్, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

భారత్ ను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. దాంతో కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా రెండోరోజు 20వేల దిగువనే నమోదయ్యాయి. తాజాగా మరణాల సంఖ్యా భారీగా తగ్గింది.

ఆదివారం 8 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 16వేల 051 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వైరస్ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో మరో 206 మంది కోవిడ్ తో చనిపోయారు. ముందురోజు ఆ సంఖ్య 673గా ఉంది. 2020 జనవరి నుంచి 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,12,109 మంది మరణించారు.

AP Secretariat : సచివాలయంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత.. అందరూ రావాల్సిందే

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 2 లక్షలకు దిగొచ్చాయి. రికవరీ రేటు 98.33 శాతం కాగా.. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక నిన్న 37,901 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.21 కోట్లు దాటింది. నిన్న 7 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా లెక్కలు విడుదల చేసింది.