AP Covid Cases : ఏపీలో కొత్తగా 18,561 కోవిడ్ కేసులు…100 దాటిన మరణాలు
- murthy
- Published On : May 17, 2021 / 06:32 PM IST
Ap Covid Cases
AP Covid Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 18,561 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 14,54,052 కు చేరింది. గత 24 గంటల్లో 109 మంది కోవిడ్ సోకి మరణించటం బాధ కలిగిస్తోంది. వీటితో మొత్తం మరణాల సంఖ్య 9,481కు చేరింది.
గత 24 గంటల్లో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,80,49,054 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,554 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. గడిచిన 24 గంటల్లో 17,334మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 12,33,017 కి చేరింది.
కాగా….కరోనా వైరస్ తో బాధపడుతూ పశ్చిమగోదావరిలో అత్యధికంగా 16మంది మృత్యువాత పడగా, అనంతపురం 10, చిత్తూరు 10, గుంటూరు 10, తూర్పుగోదావరి 9, విశాఖపట్నం 9, కృష్ణా 8, నెల్లూరు 8, విజయనగరం 8, కర్నూలు 7, శ్రీకాకుళం 7, ప్రకాశం 4, కడపలో ముగ్గురు మరణించారు.
