Sc Welfare Deputy Director Vishwamohan Reddy Misbehaves On A Female Warden
Andhra pradesh : మహిళా ఉద్యోగి అన్న కనీస గౌరవం కూడా లేకుండా..100మంది ముందు ఒక దళిత మహిళా వార్డెన్ ను ‘పనికి మాలిన దానా’ అంటూ ఒక అధికారి దూషించాడు. అధికార మదంతో ఆమెపై చేయ్యొత్తాడు. ఇష్టమొచ్చినట్లుగా తిట్టాడు. ఆమె చేసిన పాపం ఏంటంటే.. సినియార్టీ ప్రకారం, స్పౌజ్ కోటాలో బదిలీ చేయమని అడగటం. అనంతపురం జిల్లాలో హాస్టల్ వార్డెన్ల బదిలీల సందర్భంగా ఎస్సీ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్ రెడ్డి చిందులు తొక్కారు. సహజంగా దురుసుగా ప్రవర్తించే ఆ అధికారి మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా అంత ముందు దుర్భాషాలాడిన వీడియో వైరల్ గా మారింది. తాడిపత్రిలో వార్డెన్ గా పని చేస్తున్న శ్రీలక్ష్మి స్పౌజ్ కింద కదిరికి బదిలీ చేయాలని అధికారులకు విన్నవించింది.
ముందుగా అధికారులు దీనికి అంగీకరించారు. అయితే చివరి నిమిషయంలో గతంలో ఉన్న మహిళకే అవకాశం కల్పించారు. దీనిపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ చెప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే సహనం కోల్పోయిన ఎస్సీ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్ రెడ్డి కొట్టినంత పని చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇదేమైనా అంటూ హేలనగా మాట్లాడారు. ఆమె మరింత వినయంగా అభ్యర్థించినా.. పనికి మాలిన దానా బయటకు పో అంటూ దూషించారు. నువ్ ఎవరితో అయినా చెప్పుకో అంటూ దుర్భాషలాడారు. ఈసంఘటనపై దళిత సంఘాల నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఒక మహిళా ఉద్యోగి అందునా దళితురాలి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు.