SEC nimmagadda on leave : ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సమర్థమంతంగా నిర్వహించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హయాంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగవని తెలుస్తోంది. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ ఆకస్మికంగా సెలవు పెట్టారు. ఈ నెల 17 నుంచి 24 వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. ఆ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
ఈ నెల 31తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పదవీకాలం ముగిసింది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధపడతారని ఓ వాదన వినిపించింది. అయితే వచ్చేవారం సెలవు పెట్టడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేదిశగా అడుగులు వేయట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిమ్మగడ్డ హయాంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.