AP Employees Salaries : జీతాలు చెల్లించండి మహాప్రభో.. ఏపీ సీఎస్‌కు సచివాలయ ఉద్యోగుల లేఖ

ఏపీ సచివాలయ ఉద్యోగులు జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు.. ఏపీ సీఎస్ ను ఆశ్రయించారు. ఉద్యోగులకు జనవరి నెల జీతాలు ఇప్పించాలని కోరుతూ నేరుగా సీఎస్ కు లేఖ రాశారు. సచివాలయంలో ఉద్యోగులకు జనవరి నెల జీతాలు వెంటనే చెల్లించాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు.

AP Employees Salaries : ఏపీ సచివాలయ ఉద్యోగులు జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు.. ఏపీ సీఎస్ ను ఆశ్రయించారు. ఉద్యోగులకు జనవరి నెల జీతాలు ఇప్పించాలని కోరుతూ నేరుగా సీఎస్ కు లేఖ రాశారు. సచివాలయంలో ఉద్యోగులకు జనవరి నెల జీతాలు వెంటనే చెల్లించాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు.

ఏపీ సచివాలయ ఎస్ఓ అసోసియేషన్ తరపున జీతాలు ఇవ్వాలంటూ విజ్ఞాపన పత్రాన్ని కూడా సీఎస్ కు అందించారు. 6 తేదీ వచ్చినా ఇంకా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇంటి రెంట్, ఈఎంఐ, హాస్పిటల్ ఖర్చులు, స్కూల్ ఫీజులు వంటి ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదని లేఖలో తమ గోడు వెళ్లబోసుకున్నారు ఉద్యోగులు.

సచివాలయంలో పని చేసే ప్రతి ఉద్యోగి.. జీతంపై ఆధారపడే జీవిస్తున్నారని ఉద్యోగులు వెల్లడించారు. ఇంకా జీతాలు పడని ఉద్యోగులకు జీతాలు వేయాలని ఆదేశించాలంటూ సీఎస్ కు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్. దాదాపు 1200 మంది ఉద్యోగుల్లో కేవలం అసెంబ్లీ, ఫైనాన్స్, రెవెన్యూ, జీఏడీ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లింపులు జరిగాయి. ఎందుకు మాకు జీతాలు ఆలస్యం చేస్తున్నారని సెక్రటేరియేట్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.