Children: కరోనాతో అనాథలైన పిల్లల కోసం..

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. మహమ్మారి దెబ్బకు సాయం చేసేవాళ్లు కరవవుతున్నారు.. ముక్కుపచ్చలారని పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలు కోసం.. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల పిల్లలు కోసం.. ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకు.. చికిత్స పొందుతున్న పిల్లలకు సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు అధికారులు.

ఈ నిర్ణయంతో పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉంటారని, ఐసోలేషన్‌లో ఉన్న తల్లిదండ్రులకు కూడా పిల్లలకు ఏం అవుతుందో అనే బాధ ఉండదని అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు