Tammineni Sitaram : కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని..

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతు కింద పడిపోయారు. 66 ఏళ్ల స్పీకర్ తమ్మినేని శ్రీకాకుళంజిల్లా క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభిం సందర్భంగా కబడ్డీ ఆడుతు కిందపడిపోయారు.

Ap Speaker Tammineni Sitaram Falls While Playing

AP Speaker Tammineni Sitaram: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతు కింద పడిపోయారు. 66 ఏళ్ల స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా కబడ్డీ ఆటలో పాల్గొన్నారు. ఆటగాళ్లలో ఉత్సాహం నింపటానికి తన వయస్సును కూడా పట్టించుకోకుండా తెగ ఉత్సాహపడిపోయారు. ఆపై పాపం ప్రమాదవశాత్తు కింద పడిపోయారు.

కబడ్డీ ఆట ప్రారంభించాక తెగ హుషారెత్తిపోయిన స్పీకర్ కాసేపు తాను కూడా కబడ్డీ ప్లేయర్ గా మారిపోయారు. ఈ క్రమంలో ప్లేయర్ గా అవతారం ఎత్తిన స్పీకర్ ఒక టీం తరుపున కూతకు వెళ్లారు. కబడ్డీ ఆటలో కాలు స్లిప్ కింద పడిపోయారు.స్పీకర్ కిందపడగానే అక్కడున్నవారంతా కంగారు పడిపోయారు. ఆందోళన చెందారు. సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమై ఆయన్ని పైకి లేపారు. కానీ స్పీకర్ కు ఎటువంటి గాయాలు కాకపోవటంతో..ఊపిరి పీల్చుకున్నారు.

Read more : Omicron: మూడో వేవ్ రాకుండా ఒమిక్రాన్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

భారత దేశానికి క్రీడల్లో గుర్తింపు తెచ్చిన కబడ్డీ క్రీడకు ఉన్న క్రేజే వేరు. శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో పొట్టి ప్రో కబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి. ఆ క్రీడా పోటీలు రాష్ట్రంలో సీఎం కప్ పేరుతో టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్‌ కాలేజీ వేదికగా ఆ నియోజకవర్గం స్దాయి సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభిచారు ఎపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.

అలా కబడ్డీ ఆడుతూ ముగ్గురిని ఔట్ చేసిన ఉత్సాహంతో నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో కాళు జారీ కింద పడిపోయారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు ఆయన్ని వెంటనే లేవనెత్తారు. ఎటువంటి గాయాలు కాక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read more : Dr. Jupally: డాక్టర్. జూపల్లి రామేశ్వరరావుకు క్రెడాయ్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు