×
Ad

AP Fake Liquor Case : ఏపీ నకిలీ మద్యం కేసు.. జనార్దన్ రావుతో వాట్సాప్ చాట్‌పై 10టీవీ డిబేట్‌లో క్లారిటీ ఇచ్చిన జోగి రమేశ్..

AP spurious liquor case : చంద్రబాబు నాయుడుకు నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలని వైసీపీ నేత జోగి రమేష్ డిమాండ్ చేశారు.

AP spurious liquor case

Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న జనార్దన్ రావు విడుదల చేసిన వీడియోలో సంచలనంగా మారింది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ డైరెక్షన్‌లోనే తాను ఇదంతా చేశానని చెప్పాడు. అయితే, జనార్దన్ ఆఫ్రికా వెళ్లే ముందు గత నెల 23న జోగి రమేశ్ ఇంటికి వచ్చాడన్న సమాచారంతో పోలీసులు జోగి నివాసం ఉండే ప్రాంతంలో సీసీటీవీ పుటేజ్ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలాఉంటే.. ఈ వీడియోపై జోగి రమేశ్ రియాక్ట్ అయ్యారు. నన్ను ఇరికించే కుట్ర చేస్తున్నారని, జనార్దన్ రావు చెప్పిందంతా పచ్చిఅబద్దాలని చెప్పారు.

తాజాగా.. ఈ విషయంపై మాజీ మంత్రి జోగి రమేష్ 10టీవీ డిబేట్ లో పాల్గొని మాట్లాడారు. ఈ వ్యవహారంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారి సారాను బ్రాందీ షాపులకు అక్కడి నుంచి డోర్ డెలివరీ ఎలా చేస్తున్నారనే విషయాన్ని నేను బహిర్గతం చేశానని.. దీన్ని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్‌తో మరళ నాపై బురద వేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ కుటుంబ సభ్యులతో వచ్చి విజయవాడ దుర్గగుడిలో జోగిరమేశ్ ఈ కల్తీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ప్రమాణం చేయాలని, అలా చేస్తే.. నేను ఏ శిక్షనైనా అనుభవిస్తానని అన్నారు. చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు.

జనార్దన్ రావుది మా ప్రాంతమే. ఆయన, ఆయన కుటుంబం గురించి నాకు తెలుసు. అంతేకానీ, జనార్దన్ రావుతో ఎప్పుడూ వ్యాపారాలు చేయలేదు. ఆయనతో ఎప్పుడూ నేను తిరగలేదు, ఫోన్ కాంట్రాక్ట్ లో కూడా ఎప్పుడూ లేమని జోగి రమేశ్ అన్నారు. జనార్దన్ రావు రిమాండ్ రిపోర్టులోనూ జోగి రమేశ్ పేరు ప్రస్తావించలేదు. కానీ, జనార్దన్ రావును పోలీసుల రిమాండ్ లో ఉండగా.. వీడియో రిలీజ్ చేశారని చెబుతున్నారు. కేవలం తప్పుడు చర్యలతో తనపై బురద వేసి తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే.. ఉదయం నుంచి సోషల్ మీడియాలో సర్కిలేట్ అవుతున్న వాట్సాప్ కాల్ పై జోగి రమేశ్ స్పందించారు. ఆ వాట్సాప్ కాల్ జోగి రమేశ్ అన్న ఎమ్మెల్యే అనే పేరుతో ఉంది. 22 సెప్టెంబర్ సోమవారం రోజున.. కమ్ మై హోం అని జోగి రమేశ్ మెస్సేజ్ పెట్టినట్లు.. కొన్ని సెకన్లు వీడియో, వాయిస్ కాల్ మాట్లాడినట్లు.. ఆ తరువాత నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు? ఫేస్‌టైమ్ ద్వారా కాల్ చేయి అని వాట్సాప్ చాట్‌లో ఉంది.. ఆ తరువాత ఓకే అన్నా అని జనార్దన్ రావు రిప్లై ఇచ్చినట్లుగా ఉంది.
ఈ వాట్సాప్ చాట్ పై జోగి రమేశ్ స్పందించారు. నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ఇవన్నీ సృష్టిస్తున్నారు.. ఇంకా ఎన్నైనా సృష్టిస్తారు. నేనే దేనికైనా రెడీ.. చంద్రబాబు, లోకేశ్ ఎవరైనా వారి కుటుంబ సభ్యులతో దుర్గగుడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. నేను ఒప్పుకుంటా.. ఏ శిక్షకైనా రెడీ అంటూ జోగి రమేశ్ పేర్కొన్నారు.